Retro Bikes: భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 రెట్రో మోడల్ బైక్‌లు..
Retro Bikes : కొన్ని విషయాలు ఎప్పుడూ ఫ్యాషన్ ప్రపంచం నుంచి ఎన్నటికీ బయటపడవు. ఇది బైక్ లకు సరిగ్గావర్తిస్తుంది. పాత రూపానికి అధునిక హంగులను జోడిస్తూ చాలా వాహన తయారీదారులు రెట్రో- మోడల్ బైక్‌లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. భారతదేశంలో చాలా పాపులర్ అయిన ఐదు రెట్రో మోటార్‌సైకిళ్లు (Retro Bikes) ఇక్కడ ఉన్నాయి. వాటి ధర, ఇంజన్ స్పెసిఫికేషన్‌లు ఇవీ..
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రస్తుతం భారతదేశంలో ఎంతో ప్రజాదరణ పొందింది. పెద్దలు యూత్ అనే తేడా లేకుండా అందరిలో మోటార్‌సైకిల్ పై ఎంతో క్రేజ్ ఉంటుంది. స్ప్లిట్ సీట్ డిజైన్, పొడవాటి ఎగ్జాస్ట్, రౌండ్ హెడ్‌లైట్, గుండ్రని సైడ్ బాక్స్‌లు క్లాసిక్ 350 బైక్ ఆకర్షణను మరింత పెంచుతాయి. అయినప్పటికీ, డిస్క్ బ్రేక్‌లు, ABS, ఫ్యూయెల్ ఇంజెక్షన్ వంటి ఆధునిక ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.20bhp, ...