
Sunita Williams : 286 రోజుల అంతరిక్ష పర్యటన తర్వాత భూమిపై అడుగపెట్టిన సునీతా విలియమ్స్..
Sunita Williams Return Live Streaming : భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) 9 నెలల తర్వాత సురక్షితంగా భూమిపైన అడుగు పెట్టారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:27 గంటలకు స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగింది. ఆ తర్వాత డ్రాగన్ క్యాప్సూల్‌ను రికవరీ బోట్‌లో తీసుకెళ్లారు. దీని తరువాత క్యాప్యూల్ తెరవబడింది, దాని నుండి వ్యోమగాములు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు.Sunita Williams : ఉప్పొంగిన ఆనందండ్రాగన్ క్యాప్సూల్ నుండి బయటకు అడుగు పెట్టగానే సునీతా విలియమ్స్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె చేయి ఊపుతూ అందరికీ స్వాగతం పలికారు. దీని తర్వాత, స్ట్రెచర్ సహాయంతో, అమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. జూన్ 2024లో, 8 రోజుల అంతరిక్ష యాత్రకు బయలుదేరిన సునీతా విలియమ్స్ తన అంతరిక్ష నౌకలో సాంకేతిక లోపం కారణంగా 9 నెలలు అంతరిక్ష కేంద్రంలోనే గడపాల్సి వచ్చింది. US అం...