Israel Palestine conflict: ఇజ్రాయెల్ ఎలా పుట్టింది..? పాలస్తీనాతో వివాదం ఎందుకు? యూదుల వలస వెనుక చరిత్ర ఏమిటీ?
వందేళ్లుగా రగులుతున్నమారణహోమానికి కారణాలేంటీ...?Israel Palestine conflict : ఇజ్రాయెల్ - పాలస్తీనా వివాదం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అలాగే నిర్విరామంగా ఇప్పటికీ కొనసాగుతున్న సంఘర్షణలలో ఒకటి. ఈ ప్రాంతంలో యుద్ధాలు, విధ్వంసం, రక్తపాతం కలిగించే ఘోరమైన ఘటనలు నిరంతరం చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఎలా మొదలైంది? పాలస్తీనా - ఇజ్రాయెల్ చరిత్ర ఏమిటి? పూర్తి వివరాలు ఈ కథనంలో చూడండి..ఇజ్రాయెల్ నేడు పశ్చిమాసియాలోని ఒక చిన్న దేశం. ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మేఘాలయ లేదా మణిపూర్ పరిమాణంలో ఉంది.
ఇజ్రాయెల్ కు పశ్చిమాన మధ్యధరా సముద్రం, దక్షిణాన ఈజిప్ట్, తూర్పున జోర్డాన్, సిరియా.. ఉత్తరాన లెబనాన్ సరిహద్దులుగా ఉంది.
ఇజ్రాయెల్‌లో యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు మతపరమైన ప్రాముఖ్యత ఉన్న అనేక పవిత్రక్షేత్రాలు ఉన్నాయి
నేడు, ఇజ్రాయెల్ జనాభాలో ఎక్కువగా యూదులు ఉన్నారు. మ...