
Murshidabad | బాబ్రీ తరహా మసీదు నిర్మాణం ‘రాజకీయ కుట్ర’:
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్కోల్‌కతా/ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా (Murshidabad District) లో బాబ్రీ మసీదు తరహాలో నూతన మసీదును నిర్మించాలనే ప్రతిపాదనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఆదివారం తీవ్రంగా స్పందించారు. ఇది ముస్లింల ప్రయోజనం కోసం చేస్తున్న పని కాదని, కేవలం పాత వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చి ఎన్నికల లబ్ధి పొందేందుకు పన్నిన "రాజకీయ కుట్ర" అని ఆయన అభివర్ణించారు.ఓట్ల కోసమే వివాదాల పునరుద్ధరణపశ్చిమ బెంగాల్‌లో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భగవత్ మాట్లాడుతూ.. "బాబ్రీ మసీదును పునర్నిర్మించడం ద్వారా ముగిసిపోయిన వివాదాన్ని తిరిగి ప్రారంభించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం ఓట్ల కోసమే జరుగుతోంది తప్ప హిందువులకో, ముస్లింలకో దీనివల్ల ఎలాంటి లాభం లేదు. ఇలాంటి చర్యలు సమాజానికి మంచివి కావు" అని ఆయ...

