Monday, January 5Welcome to Vandebhaarath

Tag: Well Collapses

ఎద్దుని కాపాడబోయి ఐదుగురు మృతి
Crime

ఎద్దుని కాపాడబోయి ఐదుగురు మృతి

జార్ఖండ్: బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఎద్దును కాపాడేందుకు ఐదుగురు వ్యక్తులు బావిలోకి దిగగా మట్టిపె ల్లలు పడి ప్రాణాలు కోల్పోయారు. బావిలోకి దిగిన మరో ఇద్దరిని స్థానికులు క్షేమంగా బయటకు తీశారు. రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో సిల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మురిఓపీ ప్రాంతంలోని పిస్కా గ్రామంలోని బావిలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో.. గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. బావిలో అరుస్తూ కొట్టుమిట్టాడుతున్న ఎద్దుని కాపాడేందుకు నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. తాడు సాయంతో ఎద్దుని పైకి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో కొంత భాగం కుప్పకూలింది. దాంతో మట్టిపెళ్లలు కూలిపో యాయి. పైన ఉన్న మరో ముగ్గురు కూడా బావిలో పడిపోయారు. మొత్తం ఏడుగురు వ్యక్తులు బావిలో ఉండగా.. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరిని స్థానిక ప్రజలు శ్రమించి క్షేమంగా పైకి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సహా అధికారులు ఘటన...