Wed in India | ‘భారతదేశంలోనే పెళ్లి చేసుకోవాలని’ ప్రధాని మోదీ ఎందుకు కోరుకుంటున్నారు?
తన తదుపరి మిషన్ "వెడ్ ఇన్ ఇండియా (Wed in India)" అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రకటించారు. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో ని జరిగిన వికసిత్ భారత్, వికసిత్ జమ్మూ & కాశ్మీర్' కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో వెడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అన్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు వెళ్లే భారతీయులు.. జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రధాని సూచించారు. అలా చేయడం వల్ల ప్రతీ వ్యక్తి వారి పర్యటన నిమిత్తం బడ్జెట్‌లో కనీసం 5-10 శాతం స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు దీనివల్ల ఇక్కడి ప్రజల ఆదాయం పెరిగి, ప్రజలకు ఉపాధి లభిస్తుందని వివరించారు.ఇప్పుడు వెడ్ ఇండియా కార్యక్రమం కింద ప్రజలు వివాహం (wedding) కోసం ఇక్కడికి రావాలని కోరారు. ప్రతి ఏడాది 5,000 మందికి పైగా భారతీయ జంటలు విదేశాలకు వెళ్లి వివాహాల...