Water Purifiers కొంటున్నారా? అయితే ముందుగా TDS గురించి తెలుసుకోండి..!
Water Purifiers | TDS అంటే నీటిలోని మొత్తం కరిగిన ఉన్న ఘనపదార్థాలు (Total dissolved solids) స్థాయి అంటారు. నీటిలో TDS అనేది మీ పంపు నీటిలో మొత్తం కరిగిన ఘనపదార్థాల పరిమాణాన్ని సూచిస్తుంది. వర్షంగా నీరు నేలమీద పడిన తరువాత, అది రాళ్ళు, మట్టిలో ఉన్న ఖనిజాలను కలుపుకొంటుంది. ఈ నీటిలో వివిధ స్థాయిల సాంద్రతలలో ఖనిజాలు కరిగి ఉంటాయి. మొత్తం కరిగిన ఘనపదార్థాలు (TDS) అనేది ఒక నిర్దిష్ట పరిమాణంలో నీటిలో కరిగిన లోహాలు, ఖనిజాలు, లవణాలు, అయాన్లు వంటి సేంద్రీయ అలాగే అకర్బన పదార్థాల మొత్తాన్ని TDS అంటారు.ఇది ద్రావకం కాబట్టి, నీరు ఏదైనా కరిగిపోయే గుణమున్న పదార్ధం కలిసినపుడు ఆ పదార్థం యొక్క కణాలు నీటిలో కరగడం వల్ల నీటి టీడీఎస్ పెరుగుతుంది.కొన్ని ప్రాంతాల్లో ఉన్న నీటిలో ఈ కరిగిన ఖనిజాల స్థాయిలు (TDS) అధికంగా ఉంటాయి. వీటిని హార్డ్ వాటర్‌గా పిలుస్తారు. ఇవి తాగడానికి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. ...