భద్రకాళి చెరువుకు గండి
కాలనీలోకి దూసుకువస్తున్న వరద నీరు..
అప్రమత్తమైన అధికారులు
సమీప కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
వరంగల్: వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి చెరుకువుకు గండి పడింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో చెరువులోకి భారీగా నీరు వచ్చిచేరింది. సామర్థ్యానికి మించి వరద రావడంతో పోతన నగర్ వైపు ఉన్న చెరువు కట్ట తెగిపోయింది.. దీంతో చెరువులోని నీరంతా ఉధృతంగా బయటకు ప్రవహిస్తున్నది.. సరస్వతినగర్, పోతననగర్ తోపాటు చుట్టు ఉన్న కాలనీల వైపు వేగంగా వరద నీరు దూసుకువస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. అలాగే గండి పూడ్చే పనికోసం సిబ్బందిని అక్కడికి తరలిస్తున్నారు.
మరోవైపు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్ ప్రావిణ్య, నగర మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో ముంపు బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.#Warangalrains వ...