waqf law | వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
waqf amendment act 2025 : దేశంలో నేటి నుంచి వక్ఫ్ సవరణ చట్టం (waqf law) అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఏప్రిల్ 8 నుంచి వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చిందని అందులో పేర్కొంది. వక్ఫ్ సవరణ బిల్లును గత వారం పార్లమెంటు ఉభయ సభలతో ఆమోదం పొందగా ఆతర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించారు. ఆ తర్వాత ఈ కొత్త చట్టం నేటి నుంచి అమల్లోకి వస్తుంది.బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటు ఉభయ సభలు వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించాయి. ఈ బిల్లును ఏప్రిల్ 3న లోక్‌సభ ఆమోదించింది. అక్కడ 288 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఏప్రిల్ 4న రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత రాజ్యసభ కూడా దీనిని ఆమోదించింది. ఏప్రిల్ 5న అధ్యక్షుడు ముర్ము కూడా వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించారు. ఆ తరువాత ఈ కొత్త చట్టం ఏ రోజు నుం...