Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Voter Awareness

SIR | రేప‌టి నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర‌ప్రాలిత ప్రాంతాల్లో ఓట‌రు జాబితా ప్ర‌క్షాళ‌న‌
National

SIR | రేప‌టి నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర‌ప్రాలిత ప్రాంతాల్లో ఓట‌రు జాబితా ప్ర‌క్షాళ‌న‌

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మంగళవారం నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 51 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR పూర్తి చేసి ఫిబ్రవరి 7, 2026న తుది ఓటర్ల జాబితా ప్రచురించ‌నుంది.ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో బీహార్ తర్వాత ఇది రెండవ రౌండ్. దాదాపు 7.42 కోట్ల పేర్లతో రాష్ట్ర తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30న ప్రచురించారు. రెండో రౌండ్‌లో SIR నిర్వహించబడే 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.వీటిలో, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ 2026 లో ఎన్నికలు జరుగుతాయి. 2026 లో ఎన్నికలు...