Vodafone Idea సరసమైన ప్లాన్‌లలో మార్పులు.. సబ్‌స్క్రైబర్‌లకు షాక్
Vodafone Idea | భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన వోడాఫోన్ ఐడియా ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేసి వినియోగదారులకు నిరాశ కలిగించింది. జూలైలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తన ప్లాన్ ధరలను పెంచాయి. ఫలితంగా చాలా మంది వినియోగదారులు ఆర్థిక భారం తగ్గించుకునేందుకు BSNLకి మారడం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో వినియోగదారులను కోల్పోయినప్పటికీ, ఈ నష్టం వల్ల వొడాఫోన్ ఐడియా పెద్దగా ప్రభావితం కాలేదని టెలికాం వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పుడు, కంపెనీ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలోని రెండు ప్రయోజనాలకు కోతలు విధించింది. ఇది చాలా మంది వినియోగదారులను నిరాశకు గురి చేస్తుంది. ఈ ప్లాన్‌లలో ఏం మార్పు చేసిందో ఒకసారి చూడండి..
రీచార్జి ప్లాన్ రూ.289
ముందుగా రూ.289 ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు, ఈ ప్లాన్ 48 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. అంటే వినియోగదారులు దాని ప్రయోజనాలను ఎక్కువ కాల...