ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..
మూతపడిపోతున్న Cafe Coffee day సంస్థను నిలబెట్టింది.వీజీ సిద్దార్థ భార్య మాళవిక హెగ్డే విజయగాథ..అది 2019 సంవత్సరం.. భారతదేశంలోని 23 ఏళ్ల చరిత్ర కలిగిన కాఫీ చైన్, కేఫ్ కాఫీ డే (CCD) చాలా కష్టాల్లో ఉంది. వ్యాపారం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాలు తీర్చలేక దాని వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ గందరగోళం మధ్య, ఆయన భార్య మాళవిక హెగ్డే (Malavika Hegde) సంస్థను రక్షించడానికి ముందుకొచ్చింది. కాఫీ పరిశ్రమలో ఎటువంటి వృత్తిపరమైన అనుభవం లేదు. కానీ Cafe Coffee Day కి పూర్వ వైభవం తీసుకురావాలని నిశ్చయించుకుంది.ఎ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ ప్రముఖ భారతీయ కాఫీ చైన్ అయిన కేఫ్ కాఫీ డే (CCD), దాని యజమాని VG సిద్ధార్థ 2019లో ఆత్మహత్యతో మరణించడంతో పతనం అంచున ఉంది.సిద్ధార్థ CCDని జాతీయ సంస్థగా అత్యున్నత స్థితికి తీసుకొచ్చారు.. CCD కేవలం కాఫీ షాప్ కంటే ఎక్కువ.. ఇది ప్రజలు క...