
Mahashivaratri | మహాశివరాత్రికి ముస్తాబైన శైవక్షేత్రాలు
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!Vemulawada Mahashivaratri 2026 | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శనివారం నుంచి ఈ నెల 16 వరకు నిర్వహించే ఈ మహా జాతర కోసం దేవస్థానానికి సంబంధించి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.జాతర విశేషాలు & భక్తుల సౌకర్యాలు :స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు: వేములవాడ ప్రధాన ఆలయంలో ధర్మగుండం ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో, భక్తుల కోసం పార్కింగ్ ప్రదేశంలో 400 షవర్ నల్లాలు ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలిక గదులను సైతం నిర్మించారు.దర్శన ఏర్పాట్లు: భక్తులు రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని, తలనీలాలు సమర్పి...
