Pune Porsche crash news | పూణె పోర్షే యాక్సిడెంట్ కేసులో.. క్రైం థ్రిల్లర్ వెబ్ సిరిస్ ను మించి వరుస ట్విస్టులు..
Pune Porsche crash news | కొద్ది రోజుల క్రితం పూణెలో ఓ ధనిక కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు తన పోర్షే కారుతో బైక్ ను ఢీకొట్టి ఇద్దరు యువ టెక్కీల మరణానికి కారణమయ్యాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.. అయితే వరుస షాకింగ్ ట్విస్ట్ లతో ఈ కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అన్యాయంగా ఇద్దరు యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగులను పొట్టన పెట్టుకోవడమే కాకుండా కేసును కప్పిపుచ్చే ప్రయత్నం, కేసు నుంచి తప్పించుకునేందుకు రక్త నమూనాలను మార్చుకోవడం.. అండర్ వరల్డ్‌తో సంబంధాలు, పోలీసులు, వైద్యులు అవినీతికి పాల్పడడం.. వంటి అనేక కీలక మలుపులతో ఈ కేసును ఒక సీరియస్ థ్రిల్లర్ క్రైమ్ వెబ్ సిరీస్‌గా మార్చాయి. ఈ కేసులో ప్రతి రోజూ ఒక కొత్త ఆసక్తికరమైన వాస్తవం తెరపైకి వస్తోంది.మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంచలన కేసు పోర్షే కారు నడిపిన 17 ఏళ్ల యువకుడి తండ్రి అయిన ఉన్నత స...