Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Vandebharat Sleeper trains Route and Ticket prices

గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి దిల్లీకి వందేభారత్ స్లీపర్ – Vandebharat Sleeper Trains
National

గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి దిల్లీకి వందేభారత్ స్లీపర్ – Vandebharat Sleeper Trains

Vandebharat Sleeper Trains : తెలుగు రాష్ట్రాల ప్రజలకు భార‌తీయ రైల్వే (Indian Railways) శుభవార్త తెలిపింది. త్వరలో తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు నడవనున్నాయి. మొద‌టి విడతలో రెండు రైళ్లకు అనుమతి లభించింది. సికింద్రాబాద్ నుంచి న్యూదిల్లీకి ఒకటి, విజయవాడ నుంచి బెంగళూరుకు మరొక రైలు న‌డ‌వ‌నున్నాయి. సికింద్రాబాద్-దిల్లీ మార్గం రైలు ఛార్జీలు కూడా నిర్ణయించారు. విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కూడా రైలు నడపాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప‌రుగులుపెడుతున్న‌వందేభారత్ రైళ్లకు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇందులో చాలా వ‌ర‌కు పూర్తి ఆక్సుపెన్సీతో నడుస్తున్నాయి. అందుకే ఇండియ‌న్ రైల్వే వందేభారత్ స్లీపర్ రైళ్ల (Vandebharat Sleeper trains)లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌కు ప్రాధాన్యమిస్తోంది. తొలి విడతలోనే రెండు స్లీపర్ రైళ్లు కేటాయించారు. ...