VandeBharat Metro | వందే మెట్రో – వందే భారత్ రైళ్లకు తేడా ఏమిటి..? స్పీడ్, ఫీచర్లు, నగరాల వివరాలు
Vande Bharat Express v/s VandeBharat Metro : భారత్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రవేశంతో ప్రయాణ సమయం చాలా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందించింది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లతో భారతదేశంలో రైలు ప్రయాణ స్వరూపాన్నే మార్చేసింది. వాస్తవానికి 2019లో మొదటి వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైళ్లు భారతీయ రైల్వేలకు గేమ్-ఛేంజర్‌గా మారాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం, 82 వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ వందేభారత్ రైళ్ల విజయతో భారతీయ రైల్వేలు ఇప్పుడు కొత్తగా వందే మెట్రో అనే కొత్త కేటగిరీ రైళ్లను పరిచయం చేయడానికి సిద్ధమైంది.
వందే మెట్రో రైళ్లు ఏమిటి?
Vande Bharat Metro : తక్కువ దూరం గల సిటీలకు మధ్య ప్రయాణాలకు ఉద్దేశించి వందే మెట్రో ఎక్స్ ప్రెస్ రైళ్లను తీసుకొస్తున్నారు. భారతదేశంలో సబర్బన్ ప్రయాణాన్ని మెరుగుపరచడంపై భారతీయ రైల్వే దృష్టి...