Amrit Bharat Express: సామాన్యుల కోసం ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకత ఏమిటి?
Amrit Bharat Express: నాన్-ఏసీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల కోసం భారతీయ రైల్వే కొత్త రైలును ఆవిష్కరించింది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, గతంలో డిజైన్ దశలో వందే సాధారన్ అని పిలిచారు. ఇది పుష్-పుల్ రైలు, ఇది లుక్స్, ఫీచర్ల పరంగా సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుండి ప్రేరణ పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న సెకండ్ క్లాస్ స్లీపర్, సాధారణ అన్‌రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని భావిస్తున్నారు. ఈ రైలుకు సంబందించిన కొన్ని అద్భుతమైన చిత్రాలతోపాటు ఫాక్ట్స్ ఒకసారి పరిశీలించండి.అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు లోపలి భాగం
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 22 కోచ్‌లు 12 సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ క్లాస్ కోచ్‌లు అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. కొత్త రైలులో వికలాంగుల...