Vande Metro | వందే మెట్రో రైలు కోచ్‌ల తయారీ కోసం దృఢమైన ఈ కంపెనీ నుంచే..
Vande Metro : భారతీయ రైల్వేల్లో వందేభారత్ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సరికొత్త విప్లవాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ రైళ్లు విజయవంతం కావడంతో కొత్తగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, వందే భారత్ మెట్రో వేరియంట్లను తీసుకొస్తోంది ఇండియన్ రైల్వేస్.. అతి త్వరలోనే ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. తాజాగా వందేభారత్ మెట్రో రైళ్ల తయారీకి ప్రముఖ స్టీల్ కంపెనీ జిందాల్ (Jindal Stainless Ltd) నుంచి 50 టన్నుల 21ఎల్ఎన్ గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ ను సరఫరా చేసింది.జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్ (JSL) భారతీయ రైల్వేలోని వందే మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం హై-ఎండ్ క్వాలిటీ స్టీల్‌ను సరఫరా చేసినట్లు మంగళవారం ప్రకటించింది. కంపెనీ 12 రైలు కోచ్‌ల కోసం సుమారు 50 టన్నుల 21LN గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను అందించింది. భవిష్యత్తులో కూడా వందే మెట్రో రైలు సెట్‌లు లేదా అండర్‌ఫ్రేమ్‌ల కోసం ఈ హై-ఎండ్ గ్రేడ్‌ను ఉపయోగ...