వందే భారత్ స్లీపర్ రైలు 2025లో వస్తోంది.. కొత్త రైలు రూట్, టికెట్ ఛార్జీలు, కొత్త ఫీచర్లు ఇవే..
Indian Railways | రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త, దేశంలో సుదూర ప్రయాణాలు చేసేవారి కోసం భారతీయ రైల్వే కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat sleeper train) ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ రైలు ద్వారా అధునాతన సౌకర్యాలతో రాత్రిపూట వేగంగా తమ గమ్య స్థానాలను చేరుకోవచ్చు. వందేభారత్ రైలు జనవరి 2025 నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. BEML, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తున్నాయి.
వందే భారత్ స్లీపర్ రైలు: మార్గాలు
వందే భారత్ స్లీపర్ రైలు మొదట న్యూఢిల్లీ మధ్య శ్రీనగర్ మార్గంలో ప్రవేశపెట్టనున్నారు. ఇది దేశ రాజధాని ఢిల్లీని జమ్మూ, కాశ్మీర్‌కు అనుసంధానిస్తుంది. ఈ రైలు సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, దాదాపు 13 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. మరికొద్దిరోజుల్లోనే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చ...