
Vande Bharat Sleeper | దేశంలోనే తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు ప్రారంభం.. విశేషాలివే!
న్యూఢిల్లీ : భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత అధ్యాయం మొదలైంది. రైలు ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి 'వందే భారత్ స్లీపర్' రైలు (Vande Bharat Sleeper Train)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 17) ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా టౌన్ రైల్వే స్టేషన్ నుండి జెండా ఊపి ఈ అత్యాధునిక రైలును ఆయన జాతికి అంకితం చేశారు.ఈ చారిత్రాత్మక రైలు కోల్‌కతాలోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి (కామాఖ్య) మధ్య నడుస్తుంది. తూర్పు, ఈశాన్య భారతదేశాన్ని కలిపే ఈ రైలు ద్వారా దాదాపు 960 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 గంటల్లోనే చేరుకోవచ్చు. సాధారణ రైళ్లతో పోలిస్తే ఇది ప్రయాణ సమయాన్ని 2.5 నుండి 3 గంటల వరకు తగ్గిస్తుంది.తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీమాల్డాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, ప్రధానమంత్రి మోదీ ఈ అత్యాధునిక రైలును ఒక బటన్ నొక్కి, ఆపై ...
