
భారతదేశపు తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు వచ్చేస్తోంది
ముంబై: భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. దేశంలోనే మొట్టమొదటి స్లీపర్ వెర్షన్ రైలు అస్సాంలోని గౌహతి మరియు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా (హౌరా) మధ్య నడవనుంది.ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు, భద్రతా ధృవీకరణలు విజయవంతంగా పూర్తయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో ఈ రైలు ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రతిష్టాత్మక రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.180 కి.మీ వేగంతో హై-స్పీడ్ ట్రయల్ సక్సెస్ ఇటీవలే రాజస్థాన్‌లోని కోటా-నాగ్డా సెక్షన్‌లో ఈ రైలు యొక్క తుది ట్రయల్స్ నిర్వహించారు. రైల్వే సేఫ్టీ కమి...
