
Telangana | ఉడ్తా తెలంగాణ కావొద్దు..
Telangana News | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం విస్తరిస్తోందని, యువత, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని విమర్శించారు.. వనపర్తి (Vanaparthi)లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడారు. వనపర్తి జిల్లాతో నాకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పూర్తిగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని కానీ ప్రజల కష్టాలను పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ఈ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల తమ భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంకా తగిన పరిహారం ఇవ్వలేదు. ఎత్తిపోతల నిర్మాణాల వల్ల భూములు కోల్పోయిన వారిక...