Vadodara Gangrape | బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇళ్లకు వాటర్, కరెంట్ కట్
Vadodara | గుజరాత్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి (Vadodara Gangrape ) పాల్పడిన కేసులో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు అనుమానితుల ఇళ్లకు విద్యుత్, డ్రైనేజీని డిస్‌కనెక్ట్ చేసింది. నిందితుల ఇండ్ల నిర్మాణాలకు మునిసిపాలిటీ నుంచి అనుమతి లేదని పేర్కొంటూ నోటీసు అందించిన 72 గంటల తర్వాత అధికారులు తాజాగా కరెంటు, డ్రెయినేజీ కనెక్షన్ ను కట్ చేశారు.అక్టోబర్ 4న వడోదర నగర శివార్లలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబర్ 7న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసేందుకు బృందాలు వచ్చాయి. మూడు రోజుల క్రితం వడోదర మునిసిపల్ కార్పొరేషన్ (VMC) నోటీసు ఇచ్చింది. దాని తర్వాత నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్‌లను గడువు ప్రకారం కట్ చేసినట్లు తెలిపారు.నిందితులు నిర్మించిన ఇళ్లకు బిల్డింగ్ పర్మిషన్ లేదని VMC నోటీసులో పేర్కొన్నారు. ఇంతలో, వ...