Bulldozer action | సంభాల్ లో అక్రమ కట్టడాల కూల్చివేత.. ఇక్కడ విద్యుత్ స్థంభాలనూ ఆక్రమించుకున్న ఘనులు
Bulldozer action | ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ, పోలీసులు సంభాల్ (Sambhal) లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పట్టణంలో కొంతమంది నివాసితు రోడ్లను విద్యుత్ స్థంభాలను కూడా ఆక్రమించేసుకున్నారు అని పట్టణ సబ్ డివిజనల్ అధికారి సంతోష్ త్రిపాఠి (SDO) తెలిపారు. "కొందరు విద్యుత్ కనెక్షన్, సరైన మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు. లోపల ఇంకా పాత మెకానికల్ కరెంట్ మీటర్ ఉంది. పాత మీటర్లను 15 సంవత్సరాల క్రితం నిలిపివేశాం. అందుకే ఆక్రమణను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాము" అని బుల్డోజర్ చర్య సందర్భంగా త్రిపాఠి ANIకి తెలిపారు."మెకానికల్ మీటర్లను ఇకపై అమర్చకూడదని 15 సంవత్సరాల క్రితం ఆదేశాలు వచ్చాయి. పాత మీటర్లు ఎక్కడ కనిపించినా దానిని అధికారులు వెంటనే తొలగిస్తారని తెలిపారు. సంభల్ లో దాదాపు 2-3 ఇళ్లలో విద్యుత్‌ను దొంగిలించడం కనిపించిందని, అయితే మొత్తం ఇళ్ల సంఖ్య విచారణ తర్వాత త...