Surya Mitra | ప్రతీ ఇంటిపై సోలర్ ప్యానెల్స్.. ఇందుకోసం కొత్తగా 30వేల మంది సూర్యమిత్ర ఉద్యోగాల నియామకం..
Surya Mitra | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ భారీ లక్ష్యాన్ని సాధించడానికి 30,000 మంది యువకులను "సూర్య మిత్రలు (Surya Mitra )గా తీసుకోవాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా కోటి సోలార్ రూఫ్‌టాప్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రారంభించిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 25 లక్షలకు పైగా సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఇంట్లో సౌర ఫలకాలను కలిగి ఉండాలనే లక్ష్యాన్ని సాధించడానికి, సౌరశక్తి రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం చాలా ఉందని ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (UPNEDA) సీనియర్ అధికారి PTIకి తెలిపారు.ఇందుకోసం జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐలు)...