Saturday, August 30Thank you for visiting

Tag: Uganda School

ఉగాండాలో మారణహోమం

ఉగాండాలో మారణహోమం

World
పాఠశాలపై తిరుగుబాటుదారుల దాడిలో 37 మంది విద్యార్థుల మృతి కంపాలా : ఆఫ్రికా దేశం ఉగాండాలో తిరుగుబాటుదారులు మారణహోమం సృష్టించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో లింకు ఉన్న మిలిటెంట్లు పశ్చిమఉగాండాలో 37 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసి కాల్చి పొట్టనపెట్టుకున్నారు.. ఇది ఒక దశాబ్దంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి అని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సమీపంలో కాసేస్ జిల్లాలోని ఎంపాండ్‌వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌పై శుక్రవారం అర్ధరాత్రి దాడి చేశారు. డార్మిటరీని తగలబెట్టి, ఆహారాన్ని దోచుకున్నారని పోలీసులు తెలిపారు.విద్యార్థులను కత్తులతో పాశవికంగా నరికివేశారు. "దురదృష్టవశాత్తూ 37 మృతదేహాలు కనుగొన్నామని, వాటిని బ్వేరా ఆసుపత్రి మార్చురీకి తరలించారని" ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (UPDF) ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్యే ఒక ప్రకటనలో తెలిపారు. ఎనిమిది మంది గాయప...