
Tirupati Intermodal Bus Station | తిరుపతి ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై కదలిక
Tirupati Intermodal Bus Station | తిరుపతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమై తిరుపతిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై ఎట్టకేలకు కదలిక వచ్చింది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) అధికారులు తాజాగా తనిఖీ చేయడంతో ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ఈ, NHAI సంయుక్తంగా చేపట్టాలని ప్రతిపాదించారు. సెంట్రల్ బస్టాండ్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో కలిసి కంపెనీ సీఈవో ప్రకాశ్‌గౌడ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజా మిశ్రా పాల్గొని ఆవరణను పరిశీలించారు.
సకల సౌకర్యాలతో ప్రయాణ ప్రాంగణం
13 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో బస్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఒకే హబ్‌లో వివిధ ట్రాన్సిట్ మోడ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా రహదారి రద్దీని తగ్గించడం దీని లక్ష్యం. ఈ సౌకర్యంలో ప్రయాణ...