Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Tirumala laddu

Tirupati laddoo row : తిరుమ‌ల‌కు ఆవు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ టీటీడీ ఫిర్యాదు
Andhrapradesh

Tirupati laddoo row : తిరుమ‌ల‌కు ఆవు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ టీటీడీ ఫిర్యాదు

Tirupati laddoo row | తిరుపతి లడ్డూలలో కల్తీపై దుమారం రేపుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దిండిగల్‌కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్‌ (AR Dairy Foods) పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయానికి కల్తీ నెయ్యి ట్యాంకర్లను సరఫరా చేసిన స‌ద‌రు కంపెనీ క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ పోలీసులను అభ్యర్థించింది. తిరుపతి లడ్డూ (Tirumala laddu)ల నాణ్యతపై పలువురు భ‌క్తులు ఫిర్యాదు చేశారని, ఆవు నెయ్యి కొనుగోళ్లలో అనేక సమస్యలు ఉన్నాయని టీటీడీ దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. భక్తులకు అందించే ప్రసిద్ధ తిరుపతి ప్రసాదం తయారీలో బీఫ్ టాలో, చేప నూనె, పంది కొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని ఉపయోగించినట్లు నివేదికలు సూచించడంతో లడ్డూలపై వివాదం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ప్రసాదం నుంచి ఎప్పుడూ లేని వాసన వస్తోందని భక్తులు ఫిర్యాదు చేయడంతో లడ్డూల్లో కల్తీ జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స...
జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
Andhrapradesh

జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

Sanatana Dharma Rakshana Board | తిరుమ‌ల‌ లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల‌ కొవ్వును వినియోగించార‌నే వార్త‌లపై దేశ‌వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం త‌క్ష‌ణ‌మే సనాతన ధర్మ రక్షణ బోర్డు  ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “తిరుపల వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపారని గుర్తించ‌డంతో మేమంతా చాలా షాక్ కు గుర‌య్యాం. ” దిగ్భ్రాంతికరమైన నేరానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు బాధ్యత వహించాల‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ వ్య‌వ‌హారంలో బాధ్యులైన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు....
Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..
Andhrapradesh

Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..

Tirumala Laddu Controversy | క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం.. తిరుమల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల్లో ఆధ్యాత్మిక భావ‌న క‌లుగుతుంది. అందులో తిరుమ‌ల లడ్డూ అనగానే అంద‌రికీ ఎంతో ప‌విత్ర‌మైన‌దిగా, ప్ర‌తీక‌ర‌మైన‌దిగా భావిస్తారు. అద్భుత‌మైన రుచికి ఈ లడ్డూకు ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. అయితే ఈ లడ్డూ తయారీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉప‌యోగించార‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం సంచ‌ల‌నం గా మారింది. ఇదే ఇప్పుడు స‌ర్వ‌త్రా దుమారం రేపుతోంది.చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్నిత‌ప్పుబ‌ట్టారు. విషప్రచారం చేస్తే స్వామి...