
IRCTC News | రైలు ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి క్షణాల్లోనే టిక్కెట్ బుకింగ్
IRCTC News | రైలు ప్రయాణికులకు శుభవార్త.. మీరు మీ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన ఇబ్బందులు త్వరలో ఉండకపోవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టిక్కెట్లు బుక్ చేసుకున్న రైలు ప్రయాణికులు వెయిటింగ్ పీరియడ్‌లో ఇబ్బంది పడకుండా ఉండేలా త్వరలో టిక్కెట్ల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపింది.ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, మార్చి 2025 నాటికి పూర్తవుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత, రైలు ప్రయాణీకుల టిక్కెట్‌లు ఆన్‌లైన్‌లో సులభంగా బుక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీపై క్లిక్ చేసిన తర్వాత వెంటనే వారికి టికెట్ కన్ఫార్మ్ అవుతుంది.టికెట్ బుకింగ్ మొత్తం ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది ప్రయాణికులు తక్కువ సమయంలోనే టిక్కెట్‌ను బుక్ చేసుకోగలరు. అంతేకాకుండా IRCTC ప్రయాణికులు తమ డబ్బు డ్రా అయి కూడా టిక్కెట్లు బుక్ కాకపో...