ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 11 మందికి గాయాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 11 మంది గాయపడ్డారు.
గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు సమాచారం అందించారు.అన్నమయ: ఆంధ్రప్రదేశ్ అన్నమయ జిల్లాలో శుక్రవారం ఉదయం జీపు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, పదకొండు మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
"ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మరణించారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్పించారు" అని మేతంపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగబాబు ANIకి తెలిపారు.గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.లారీ కడప నుంచి చిత్తూరుకు వెళ్తుండగా, మరోవైపు జీపులో 16 మంది యాత్రికులు తిరుమలకు వెళ్లి కర్ణా...