శ్రీదేవి అభిమానులకు కానుక
The Life Of A Legend పేరుతో త్వరలో బయోగ్రఫీ..
భాషతో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు అం నటి శ్రీదేవి. 2018, ఫిబ్రవరి 24న శ్రీదేవి 54ఏళ్ల వయస్సులోనే ఆమె లోకాన్ని వీడింది. 80's 90's వ దశకంలో వెండితెర రాణిలా ఓ వెలుగు వెలిగింది. కాగా శ్రీదేవి భర్త-నటుడు-నిర్మాత బోనీ కపూర్.. శ్రీదేవి జీవిత చరిత్రను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ ( The Life Of A Legend ) పేరుతో పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధీరజ్ కుమార్ రాసిన ఈ బయోగ్రాఫికల్ ప్రచురణ హక్కులను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సొంతం చేసుకుంది.
ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్
సినీ ప్రపంచంలో శ్రీదేవి (Sridevi) అద్భతమైన జైత్రయాత్రకు సంబంధించి అన్నివివరాలను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పుస్తకంలో పొందుపరిచినట్లు ప్రచురణ కర్తలు వెల్లడించారు. భారతదేశంలోని "గొప్ప క...