Thursday, December 19Thank you for visiting
Shadow

Tag: TGSRTC

TGSRTC : ఈ రెండు జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్ డిపోలు..

TGSRTC : ఈ రెండు జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్ డిపోలు..

Telangana
TGSRTC | తెలంగాణ ఆర్టీసీని ముందుకు నడిపించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఆర్టీసీలో త్వరలో నియామకాలు ఉంటాయని ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రకటించారు. అలాగే కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నారు. అద్దె బస్సుల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రాజధాని నగరంలో  కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్  బస్సులను కూడా ప్రారంభించారు.  మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా  ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. పెద్దపల్లి,  ములుగులో కొత్త బస్ డిపోలు తాజాగా తెలంగాణలో కొత్తగా రెండు ఆర్టీసీ (TGSRTC) బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.  గత 15 సంవత్పసరాలుగా రాష్ట్రంలో ఒక్క కొత్త బస్సు డిపో కూడా ఏర్పాటు చేయలేదని ఆయన గు...
భక్తులకు శుభవార్త..  కార్తీకమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీస్ లు

భక్తులకు శుభవార్త.. కార్తీకమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీస్ లు

Telangana
RTC Karthika Masam Special Buses : పవిత్ర కార్తీక‌ మాసంలో రాష్ట్రంలోని ప్ర‌సిద్ధ‌ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD Sajjanar ) వివ‌రాల‌ను వెల్లడించారు. వేముల‌వాడ, శ్రీశైలం, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక‌ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని స‌జ్జ‌నార్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి ఉన్నతాధికారులతో ఈరోజు ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వహించారు. కార్తీకమాసంలో స్పెషల్‌ బస్‌లు : టీజీఎస్‌ ఆర్టీసీకి కార్తీక‌ మాసం, శ‌బ‌రిమ‌ల యాత్ర‌ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న‌ అ...
TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..

TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..

Telangana
Hyderabad TGSRTC Cargo | ఇక నుంచి ఇంటి వ‌ద్ద‌కే నేరుగా కార్గో సేవ‌లను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) సిద్ధమైంది. ఆర్టీసీ  ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను  వేగంగా విస్త‌రించేందుకు  చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్ లో  వేగ‌వంత‌మైన కార్గో సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ వెల్ల‌డించారు. రేపటి నుంచే హైద‌రాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని మంత్రి పొన్నం వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్క‌డికైనా హోం డెలివ‌రీ చేయవ‌చ్చ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయా...
TGSRTC | ఆర్టీసీ టికెట్ ధ‌ర‌ల పెంపుపై వీసీ స‌జ్జ‌నార్ ఏం చెప్పారంటే..

TGSRTC | ఆర్టీసీ టికెట్ ధ‌ర‌ల పెంపుపై వీసీ స‌జ్జ‌నార్ ఏం చెప్పారంటే..

Telangana
TGSRTC | బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో ఆర్టీసీ టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ (Sajjanar) స్ప‌ష్టం చేశారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించింది. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్య స్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోంది. ప్ర‌యాణికుల‌ రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు న‌డిపిస్తుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి...
Electric Ordinary Buses | నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డినరీ బస్సులొస్తున్నాయ్..

Electric Ordinary Buses | నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డినరీ బస్సులొస్తున్నాయ్..

Telangana
Electric Ordinary Buses in Hyderabad | హైదరాబాద్ మహానగరంలో సమీప భవిష్కత్ లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే పరుగులుపెట్టన్నాయి. పాత బస్సుల స్థానంలో కొత్త డీజీల్ బస్సులకు బదులుగా పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) భావిస్తోంది. ఇటీవ‌ల విద్యుత్ మెట్రో బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా ద‌స‌రా (Dasara ) క‌ల్లా విద్యుత్‌ ఆర్డినరీ బస్సులు కూడా రాబోతున్నాయి.ప్రస్తుతం ఉన్న ఆర్డినరీ బస్సులకు విభిన్నంగా ఆక‌ర్ష‌నీయంగా చూడ‌డానికి ఏసీ బస్సుల్లా క‌నిపించ‌బోతున్నాయి.హైద‌రాబాద్ లో ఇప్పటికే ఏసీ, నాన్‌ ఏసీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎల‌క్ట్రిక్‌ బస్సులను తీసుకొచ్చిన ఆర్టీసీ తాజాగా ఆర్డినరీ బస్సుల‌ను కూడా తీసుకురాబోతోంది. ప్రయాణికుల స్పందన ఆధారంగా విడతల వారీగా మరిన్ని ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్‌ ఆర్డినరీ బస్సులను ఏ మార్...
ప్ర‌యాణికుల‌కు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. హైద‌రాబాద్ శివార్ల‌లో..

ప్ర‌యాణికుల‌కు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. హైద‌రాబాద్ శివార్ల‌లో..

Telangana
Special Buses for Dasara హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) 6,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు అక్టోబరు 1 నుంచి 15 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వాటిలో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని తెలిపింది. న‌గ‌ర కీల‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక బ‌స్సులు పండుగల సమయంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది . MGBS , JBS, LB నగర్ , ఉప్పల్, ఆరామ్‌ఘర్, సంతోష్‌నగర్, KPHB, ఇతర ప్రాంతాల నుంచి వారి స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక బ‌స్సులు అందుబాటులో ఉంచబడతాయి . ఐటీ కారిడార్‌ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మీదుగా విజయవాడ , బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్స...
ప్ర‌యాణికుల‌కు TGSRTC గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

ప్ర‌యాణికుల‌కు TGSRTC గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

Telangana
TGSRTC Metro Delux Bus | హైదరాబాద్: ప్ర‌జ‌ల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న 55 ఫ్లీట్‌కు మరో మెట్రో డీలక్స్ బస్సులను ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఉప్పల్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, జగద్గిరిగుట్ట, ఎల్‌బీ నగర్ వంటి కీలక మార్గాల్లో 70 కొత్త బస్సులు సేవలందించ‌నున్నాయి. కొత్త మెట్రో డీలక్స్ బస్సులను హైదరాబాద్ అంతటా అధిక డిమాండ్ ఉన్న రూట్లలో న‌డిపించ‌నున్నారు. ఇక్కడ ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడానికి బస్సులు 15-20 నిమిషాల వ్యవధిలో నడుస్తాయి. ప్రస్తుతం, ఈ RTC బస్సులు ఉప్పల్-మెహదీపట్నం, సికింద్రాబాద్-ECIL, కోఠి, అబ్దుల్లాపూర్‌మెట్‌లతో సహా ప్రధాన మార్గాలను కవర్ చేస్తాయి ఇవి నగర ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించ‌నున్నాయి. మహిళా ప్రయాణికులు టికెట్ చెల్లించాల్సిందే.. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్‌లో క...
TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

Telangana
TGSRTC Bus Hire Discount | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజిఎస్‌ఆర్‌టిసి ) వివాహాలు, కుటుంబ వేడుకలు, పార్టీలు మొదలైన వాటి కోసం అద్దెకు తీసుకున్న లేదా బుక్ చేసుకునే బస్సులపై ప్రత్యేక 10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు డిసెంబర్ 31 వరకు అద్దె బస్సులపై మాత్రమే వర్తిస్తుంది.గతంలో కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప యాత్ర‌ల‌, సమయంలో అద్దె లేదా కాంట్రాక్ట్ బస్సులకు ఆర్టీసీ రాయితీలు కల్పించింది . అయితే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయి అధికారులు 10శాతం రాయితీ కల్పించాలని నిర్ణ‌యించిన‌ట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుభకార్యక్రమాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ రాయితీని అందించినట్లు TGSRTC తెలిపింది.ప్రైవేట్ వాహనాల కంటే చాలా తక్కువ ధరలకు కార్పొరేషన్ బస్సులను అద్దెకు ఇస్తోంది. ముందస్తుగా నగదు జమ చేయకుండా...
TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు

TGSRTC New Buses | తీరనున్న ప్రయాణికుల కష్టాలు.. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోలు

Telangana
Hyderabad | తెలంగాణ‌లో ప్ర‌జల డిమాండ్ కు త‌గిన‌ట్లుగా కొత్త బ‌స్సుల కొనుగోలు (TGSRTC New Buses) కు ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. పెరిగిన ర‌వాణా అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ప్ర‌తిపాదికగా బ‌స్సుల కొనుగోలుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్పారు. రాష్ట్ర స‌చివాల‌యంలో టీజీ ఆర్టీసీపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. మ‌హిళ‌లు మ‌హాల‌క్ష్మి ప‌థకాన్ని వినియోగించుకుంటున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా అమ‌లవుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేశార‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి మ‌హిళా ప్ర‌యాణికుల‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయింద‌ని రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌ తెలిపారు.టిజి ఆర్టీసీలో 7,29...
TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

Andhrapradesh, Telangana
TGSRTC Discount | హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అవ‌స్థ‌లుప‌డుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌ (Hyderabad to Vijayawada buses )లో రాజధాని AC సూపర్ లగ్జరీ బస్సులతో స‌హా అన్నింటిలో ప్ర‌యాణించేవారికి 10 శాతం రాయితీని అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్‌ఆర్‌టీసీ ) నిర్ణయించింది.హైదరాబాద్-విజయవాడ మార్గంలో ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్థిక భారాన్ని తగ్గించాల‌నే ఉద్దేశంతో కొన్ని హైఎండ్ సర్వీసులపై రాయితీలు (TGSRTC Discount) కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రాయితీ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మార్గంలో వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలనుకుంటే, విజయవాడ వరకు టిక్కెట్‌పై 10 శ...