LRS in Telangana | ఎల్ఆర్ఎస్‌పై కీలక అప్ డేట్.. మూడు నెలల్లోనే పరిష్కారం.. తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం
LRS in Telangana : రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరించాలని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్. ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు. తమ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
మొత్తం 25.70 లక్షల దరఖాస్తులు..
శనివారం భూపాలపల్లి పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అక్కడి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ...