
మహాశివరాత్రికి ఆర్టీసీ సన్నద్ధం: 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులు!
Maha shivratri 2026 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 ప్రధాన శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి 16 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.ప్రముఖ శైవక్షేత్రాలు - బస్సుల వివరాలు:భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయాలకు కేటాయించిన బస్సులు:శ్రీశైలం: 781 సర్వీసులువేములవాడ: 416 సర్వీసులుకీసరగుట్ట: 326 సర్వీసులుఏడుపాయల: 249 సర్వీసులువేలాల: 127 సర్వీసులుకాళేశ్వరం: 71 సర్వీసులుఇతర క్షేత్రాలు (కొమురవెల్లి, రామప్ప, పాలకుర్తి మొదలైనవి): 273 సర్వీసులుమహిళలకు 'మహాలక్ష్మి' ఉచిత ప్రయాణంప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఈ ప్రత్యేక బస్సుల్లో (పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రె...
