తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
Telangana Martyrs Memorial : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నిత్యం నివాళులర్పించేందుకు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన ఈ తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి రాష్ట్ర ప్రజలకు, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరజ్యోతి స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసిన వారందరికీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చివరి రోజు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
1969 నాటి తెలంగాణ ఉద్యమ ఛాయాచిత్రాలతో కూడిన భారీ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటి, రెండో దశకు దారితీసిన సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైన కేసీఆర్.. వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులు, ...