Telangana Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్ త్రీ జిల్లాలు ఇవే..
Telangana Inter Results : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, బోర్డు కార్యదర్శి శ్రుతి వోజా ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరాలకు సంబంధించి ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.
బాలికలదే హవా
ఇంటర్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 4.78 లక్షల విద్యార్థులు హాజరు కాగా, అందులో 2.87 లక్షల మంది పాస్ అయ్యారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 5.02 లక్షల మంది హాజరు కాగా, 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఈసారి కూడా బాలుర కంటే బాలికలే ముందున్నారు. బాలికలు ఫస్టియర్ లో 68.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాల...