Saturday, August 30Thank you for visiting

Tag: Telangana Assembly Sessions

తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు..  ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు.. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

Telangana
Telangana Assembly Sessions: తెలంగాణలో ఆర్థికి స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, వేర్వేరు మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. Telangana Assembly Sessions అసెంబ్లీలో 42పేజీల శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని సభ్యులందరికీ అందజేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. 2014-15 నాటికి ఈ అప్పు 72 వేల 658 కోట్లు ఉండేదని, ఈ పదేళ్ల కాలంలో ఆ అప్పు 24.05 శాతం పెరిగిందని వివరించింది. 2023-24లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం.. రాష్ట్ర అప్పు రూ.3 లక్షల 89వేల 673 కోట్...