నడిరోడ్డుపైనే బర్త్ డే కేక్ కటింగ్.. హారన్ మోగించినందుకు ఆటో డ్రైవర్ ను నరికి చంపిన దుండదులు
తమిళనాడులో దారుణంచెన్నై: ఇటీవల కాలంలో ఊహించని దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా తమిళనాడులో చిన్న కారణంతోనే ఓ అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారు. ట్రాఫిక్ ను పట్టించుకోకుండా కొందరు నడి రోడ్డుపై బర్త్‌డే కేక్ కట్ చేస్తుండగా.. దారివ్వమని హారన్ మోగించిన ఆటో డ్రైవర్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని అంబత్తూరులో చోటుచేసుకుంది. మృతుడిని అంబత్తూరులోని వెంకటేశ్వర నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కమేష్ (25)గా
గుర్తించారు. ఆటోరిక్షా అతని స్నేహితుడిది. ఈ దాడిలో కమేష్ సోదరుడు సతీష్ (29) కూడా గాయపడ్డాడు.వివరాల్లోకి వెళితే.. గత గురువారం రాత్రి కామేష్ తన సోదరుడిని అంబత్తూరు నుంచి తీసుకొచ్చి ఇంటిలో దింపేందుకు ఒరగడమ్‌కు వెళ్తున్నాడు. రాత్రి 11.30 గంటల
ప్రాంతంలో అయ్యప్పన్ స్ట్రీట్ జంక్షన్‌ల...