పోలీసులపైనే వేటకొడవల్లతో దాడి.. ఎంకౌంటర్ లో ఇద్దరు కరడుగట్టిన నేరస్థుల మృతి
చెన్నై సమీపంలోని గుడువాంచేరిలో మంగళవారం వాహన తనిఖీ డ్యూటీ లో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్‌పై ఇద్దరు రౌడీ షీటర్లు వేట కొడవల్లతో దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరు చనిపోయారు. మృతులు రమేష్, చోటా వినోద్ ఇద్దరూ కరడుగట్టిన నేరస్థులు.. వీరిపై గతంలో హత్య, దోపిడీ, గూండాయిజం వంటి పలు కేసులు నమోదయ్యాయి.ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వేగంగా వచ్చిన బ్లాక్ స్కోడా కారు సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. అయితే కారు అతనికి బదులుగా పోలీసు జీపును ఢీకొట్టింది.నలుగురు వ్యక్తులు కారులోంచి దూకి పోలీసులపై దాడి చేయడంతో శివగురునాథన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. అతని తలపై దాడికి యత్నించగా, సబ్‌ఇన్‌స్పెక్టర్ కిందపడిపోయాడు.దీంతో అప్రమత్తం అయిన శివగురునాథన్, మురుగేశన్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ...