Taiwan Earthquake : తైవాన్‌లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు..
Taiwan Earthquake | తైవాన్ రాజధాని తైపీ నగరాన్ని భారీ భూకంపం ( Taiwan Earthquake) వణికించింది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో 7.5 తీవ్రతతో భూమి ఒక్కసారిగా కంపించింది. ఈ భూకంపం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 700 మందికిపైగా గాయాలపాలయ్యారు.దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమిలో 34.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపనాలు సంభావించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఆ తరువాత 6.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. కాగా పాతికేళ్లలో తైవాన్‌ను తాకిన అతిపెద్ద భూకంపం ఇదే అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. భూకంపం ప్రతాపానికి పెద్ద ఎత్తున భవనాలు ఊగిపోవడం కనిపించింది. పలు బ్రిడ్జిలు సైతం ఊగిపోయాయి. ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. నిలబడిపోయారు. బిల్డింగ్‌లు, బ్రిడ్జిలు ఊగిపోతున్...