CAA Rules |పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటీ? కేంద్రం గెజిట్‌లో ఏముంది?
What is CAA : ఊహించినట్లుగానే, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, పౌరసత్వ (సవరణ) చట్టం ( CAA ) 2019 అమలుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సోమవారం నోటిఫై చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (Citizenship (Amendment) Act) మార్చి 11 2024 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం సంచలన ప్రకటన చేసింది. సీఏఏ అమలుతో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభించనుంది. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన వలసదారులందరికీ ఈ చట్టం వర్తింజేయునున్నారు. .అయితే, 1955 నాటి చట్టంలో సవరణలు చేసిన మోదీ ప్రభుత్వం.. 2019 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. 2020లోనే దీన్ని అమలు చేయాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభనతో అప్పుడు సాద్యం కాలేదు. అయితే దాదాపు ఐదేళ్ల తరవాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్త...