లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?
రియల్ లెదర్ & సింథటిక్ గుర్తించడానికి క్లూలు తెలుసుకోండి
మనలో చాలా మంది లెదర్ వస్తువులను ఉపయోగించునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే లెదర్ ప్రోడక్స్ కొనేపుడు చాలామంది కస్టమర్లు ఇది నిజమైన లెదరేనా?" లేదా నకిలీదా.. లేదా సింథటికా? అనే ప్రశ్నలు తలెత్తూనే ఉంటాయి. లెదర్ బెల్టులు, బ్యాగులు, చెప్పులు, పర్సులు వంటి లెదర్ వస్తువులను కొనేటపుడు ఈ సమస్య తరచూ ఎదురవుతూ ఉంటుంది. సింథటిక్ (Synthetic) అనేది ఒరిజినల్ లెదర్ కు ప్రత్యామ్నాయం.. ఈ రెండింటి మధ్య తేడాతెలుసుకోవడం కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి . ఏది ఏమైనప్పటికీ, కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌లు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సింథటిక్ లేదా ఒరిజినల్
లెదర్‌ను గుర్తించేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి మీ కళ్ళు, ముక్కు, స్పర్శతో గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
క్వాలిటీ లెదర్
లెదర్ నాణ్యతను నిర్ణయించడంలో మొదటి క్లూ కంపెనీ వెబ్‌సైట్. ప్రొడ...