Pakistan | భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన పిల్లలు మురికి కాలువల్లో పడి చస్తున్నరు.. పాక్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pakistan | భారత్ ఒకవైపు అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంటే పాక్ లో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయని పాకిస్థాన్ ఎంపీ సయ్యద్ ముస్తాఫా కమల్ వెల్లడించారు. పాకిస్థాన్ లోని రాజకీయ పార్టీ ముత్తాహి దా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ (Syed Mustafa Kamal) పాక్ పార్లమెంట్‌లో బుధవారం దేశ సమస్యలను ప్రస్తావించారు. ‘ప్రపంచం ఓవైపు చంద్రుడిపైకి వెళ్తుండగా మన కరాచీ పరిస్థితి చూస్తే చాలా మంది చిన్నారులు మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక్కడ కరాచీలో ఒక చిన్నారి కాలువలో పడి మరణించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతీ మూడు రోజలకు ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయి అంటూ పాక్‌లోని పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఆయన కరాచీలోని తాగునీటి ఎద్దడి సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. ‘కరాచీ పాకిస్థాన్‌కు ప్రధాన ఆదాయ వనరు.. దేశంలో...