Rare Judgement | రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష.. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు
రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష
రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పుసూర్యాపేట: మదమెక్కిన కామాంధుడికి న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి ఏకంగా 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2012లో చోటుచేసుకున్న ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు (Rare Judgement) ఇచ్చింది. ఈ తీర్పుపై మహిళా, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
వివరాలలోకి వెళితే.. సూర్యాపేట జిల్లాకు చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉపాధి కోసం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణ పరిధిలోని ఆర్జాలబావి ప్రాంతంలో నివాసముంటూ కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సెంట్రింగ్ పనిచేసే చిట్యాలకు చెందిన నిజాముద్దీన్ అలియాస్ నిజ్జు వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉన్నాడు. మైనర్ బాలికకు చాక్లెట్లు కొనిస్తూ, మొబైల్ ఫోన్ చూపిస్తూ అసభ్యంగా ప్ర...