బెంగళూరు టెకీ-మోడల్ ఆత్మహత్య.. నిందితుడిని పట్టించిన డైరీ
Bengaluru: బెంగళూరుకు చెందిన టెక్కీ/ మోడల్ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని ఆమె రాసుకున్న డైరీ పట్టించింది. డైరీలో ఆమె పేర్కొన్న ఆధారాలతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు
బెంగళూరులో మరణించిన మోడల్ తనకు ఎదురైన వేధింపుల వివరిస్తూ డైరీలో పూర్తి వివరాలను రాసింది. విచారణలో భాగంగా ఆ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వివరాల ఆధారంగా ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఉత్తర బెంగళూరులోని కెంపపురాలో జూలై 21న బాధితురాలు విద్యాశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. డైరీలో బాధితురాలు తన మరణానికి ప్రియుడే కారణమని పేర్కొంది. దీంతో 27 ఏళ్ల జిమ్ ట్రైనర్ అక్షయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
డైరీలో ఏముంది?
డైరీలో, బాధితురాలు అక్షయ్ తనతో "కుక్కలాగా ప్రవర్తించాడు" అని పేర్కొంది. తనకు చెల్లించాల్సిన సుమారు 1.76 లక్షల మ...