Sambhal Violence | సంభాల్ షాహీ జామా మసీదుగా సర్వే బృందంపై రాళ్ల దాడి, సెక్షన్ 144 విధింపు
Sambhal Violence | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వేపై దుమారం రేగింది. ఆదివారం ఉదయం మసీదును సర్వే చేయడానికి వచ్చిన అధికారుల సర్వే బృందంపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి రాళ్ల దాడికి పాల్పడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌తో పాటు లాఠీచార్జికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.సంభాల్‌లోని షాహీ జామా మసీదుకు సంబంధించి వివాదం నెలకొంది. ఇక్కడ హిందూ పక్షం ఇది జామా మసీదు కాదని, హరిహర దేవాలయమని వాదిస్తోంది. దీనిపై కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, విచారణకు ఆదేశించింది. ఈరోజు ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచి ఇక్కడ సర్వే నిర్వహించాల్సి ఉంది. అడ్వకేట్ కమీషనర్ సర్వే కోసం వచ్చారు, అయితే ఇంతలో పెద్ద సంఖ్యలో దుండగులు అక్కడ గుమిగూడి రాళ్ల దాడి ప్రారంభించారు.షాహీ జామా మసీదు సర్వే సందర్భ...