శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు
Kazipet: హన్మకొండ జిల్లా కాజీపేటలోని ప్రసిద్ధ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో శుక్రవారం నుంచి (ఆగస్టు 18 ) శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఆగస్టు 18న సంతోషిమాతకు అభిషేకం, 19న శనివారం వేంకటేశ్వర స్వామివారికి పూజలు, అభిషేకాలు, 20న సంతాన నాగలింగేశ్వరస్వామికి అభిషేకం, 21న సోమవారం నాగేంద్రుడికి, 22న గాయత్రి అమ్మవారికి, 25న శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. 26న శనివారం వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం, 27న ఆదివారం ఉదయం లక్ష్మీ నారాయణ హోమం, 31న గురువారం సాయంత్రం రక్షా బంధన్ విశేష పూజలు జరగనున్నాయి.
సెప్టెంబర్ 2న శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యే క పూజలు, సెప్టెంబర్ 3న సంకటహర చతుర్థి, శ్వేతార్కమూల గణపతి స్వామివారికి గంధం మరియు పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న బు...