
Special Trains | ప్రయాణికులకు శుభవార్త.. వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు ఇవే..
Special Trains వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి.. అందరూ సమ్మర్ వేకేషన్స్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సుల్లో రద్దీ పెరగనుంది. ప్రయాణికుల నుంచి వస్తున్నడిమాండ్ ను పరిగణలోకి తీసుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు.. వివిధ ప్రాంతాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపనున్నట్టు ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో పలు ప్రాంతాలను కలుపుతూ 48 ప్రత్యేక వేసవి రైళ్లను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ - నాగర్‌సోల్ (ట్రైన్ నంబర్. 07517) ఏప్రిల్ 17 , మే 29 మధ్య నడుస్తుంది, నాగర్‌సోల్ - సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్. 07518) ఏప్రిల్ 18, మే 30 మధ్య నడుస్తుంది.అదేవిధంగా, ప్రత్యేక రైలు హైదరాబాద్ - కటక్ (ట్రైన్ నంబర్ 07165) మంగళవారం (ఏప్రిల్ 16, ఏప్రిల్ 23 , ఏప్రిల్ 30) నడుస్తుంది, కటక్-హైదరా...