Bhatti Vikramarka | నిరుపేదలకు గుడ్ న్యూస్.. భూమిలేని వారి ఖాతాల్లో రూ. 12 వేలు.. ఈ ఏడాది నుంచే అమలు..!
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
Khammam : భూమిలేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.12 వేలు జమచేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వెల్లడించారు. మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రెండో విడత దళిత బంధు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పరిపాలనలోకి వొచ్చిందని, అందుకే తమ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని వివరించారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.ఆరు లక్షల...