
Fire-Boltt Oracle : 4G సిమ్ సపోర్ట్ తో ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది.. దీని ధర, ఫీచర్లు ఇవే..
Fire-Boltt Oracle Smart Watch : భారతదేశంలో ఫైర్-బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. గతంలో కంపెనీ 2.02-అంగుళాల స్క్రీన్‌తో ఫైర్ -బోల్ట్ డ్రీమ్ రిస్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒరాకిల్ మోడల్ కాస్త చిన్న స్క్రీన్‌తో వస్తుంది. ఇది Android-ఆధారిత UIపై పనిచేస్తుంది. అనేక Google Play స్టోర్ అప్లికేషన్‌లకు సపోర్ట్ ఇస్తుంది, అలాగే Android , iOS రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. ఇది దేశంలో వివిధ రంగు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు, స్మార్ట్ వేరబుల్ నానో-సిమ్ ద్వారా 4G LTE కాలింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.
ఫైర్-బోల్ట్ ఒరాకిల్ ధర
Fire-Boltt Oracle Price : భారతదేశంలో Fire-Boltt Oracle ఎక్లిప్స్-ఫ్లెక్స్, మెరైన్-మిరాజ్, ఒనిక్స్-వేవ్, ఆరెంజ్-హారిజన్, క్లౌడ్-విస్పర్ క్రిస్టల్-టైడ్ కలర్ వేరియంట్ల ప్రారంభ ధర రూ. 4,999 గా ఉంది. అలాగే క్లౌడీ-క్లాస్ప్, బ్లాక్-క్రోమ్ ఎంపిక...